మూడో టెస్టుకు మళ్లీ జట్టులోకి హేజిల్‌వుడ్.. 9 d ago
భారత్‌తో జరిగే మూడవ టెస్టుకు చెందిన తుది జట్టును ఇవాళ ఆస్ట్రేలియా ప్రకటించింది.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆడిన ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టేశారు. మూడవ టెస్టుకు బోలాండ్ స్థానంలో తిరిగి హేజిల్‌వుడ్‌ను తీసుకున్నారు. ఫస్ట్ టెస్టులో ఆడిన హేజిల్‌వుడ్, వెన్ను గాయం వల్ల రెండో టెస్టుకు దూరం అయ్యాడు. బ్రిస్బేన్ టెస్టులో హేజిల్‌వుడ్ రాణిస్తాడని ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ తెలిపాడు. రెండో టెస్టులో బోలాండ్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను కోహ్లీని ఔట్ చేసిన విషయం తెలిసిందే.